Sunday, December 22, 2024

పిఠాపురంలో పవన్ కల్యాణ్‌పై ఆర్జీవీ పోటీ

- Advertisement -
- Advertisement -

ఆర్జీవీ అంటే కేరాఫ్ సెన్షషన్! ఆయన సినిమా తీసినా, కామెంట్  చేసినా అది సెన్సేషన్ కావలసిందే! ఏం మాట్లాడినా  కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడటం ఆర్జీవీ స్టైల్. చంద్రబాబును క్రిటిసైజ్ తీస్తూ తీసిన  ‘శపథం’ మూవీ రిలీజ్ పనుల్లో  బిజీబిజీగా ఉన్న ఆర్జీవీ, కొంతసేపటి క్రితం చేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతోంది.

‘అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం… నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని చెప్పడానికి సంతోషిస్తున్నాను’ అంటూ చేసిన ఆ కామెంట్ పట్ల నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆర్జీవీ నిజంగానే పోటీ చేస్తారా లేక తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని పవన్ కల్యాణ్ ప్రకటించాడు కాబట్టి ఆర్జీవీ కూడా పవర్ స్టార్ ను ఇరకాటంలో పెట్టేందుకు ఇలా పోస్ట్ పెట్టాడా అని చర్చించుకుంటున్నారు. ఇందులో ఎంత నిజం ఉందో నిలకడ మీద తెలియాల్సిందే!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News