Wednesday, January 22, 2025

జూబ్లీహిల్స్ ఘటనపై రామ్‌గోపాల్ వర్మ ట్వీట్

- Advertisement -
- Advertisement -

Ram Gopal Varma tweet on Jubilee Hills Rape Case 

మన తెలంగాణ/హైదరాబాద్: సంచలన విషయాలపై తనదైన శైలిలో స్పందించే దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటనపై కూడా స్పందించారు. ‘జూబ్లీహిల్స్ ఘటనపై బిజెపి ఎంఎల్‌ఎ రఘునందన్‌రావు మాత్రమే నిజాయితీగా మాట్లాడుతున్నారు. మిగతా వారంతా తప్పుదోవ పట్టించేలా వ్యవహరించడం బాధాకరం’ అని వర్మ ట్వీట్ చేశారు. జూబ్లీహిల్స్ ఘటన బాహ్య ప్రపంచానికి తెలియక ముందే దుబ్బాక బిజెపి ఎంఎల్‌ఎ రఘునందన్‌రావు మీడియా సమావేశం నిర్వహించి నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రముఖుల పిల్లలు ఉండటంతోనే కేసు దర్యాప్తును పోలీసులు నీరుగారుస్తున్నారని విమర్శించారు. ఘటనకు సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు మీడియాకు విడుదల చేయడంతో రఘునందన్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి విదితమే.

Ram Gopal Varma tweet on Jubilee Hills Rape Case 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News