- Advertisement -
సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శుక్రవారం ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీసుల ఎదుట విచారణకు హాజరు కానున్నారు. చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు, పవన్‌కల్యాణ్‌లను కించపరిచేలా పోస్టులు పెట్టారం టూ వర్మపై గతేడాది ప్రకాశం జిల్లాలో కేసు నమోదైంది. ఒంగోలు రూరల్ పోలీసుస్టేషన్‌లో నమోదైన ఈ కేసులో వర్మ ఫిబ్రవరి 7న విచారణకు వస్తున్నారు. వాస్తవానికి ఫిబ్రవరి 4న విచారణకు రావాలంటూ వర్మకు ఇటీవల పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే, తాను 7వ తేదీన విచారణకు వస్తానని, వెసులుబాటు కల్పించాలని వర్మ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు విచారణ అధికారిగా ఉన్న సిఐ శ్రీకాంత్‌కు సమాచారం అందించారు. అధికారుల అనుమతి మేరకు వర్మ శుక్రవారం నాడు ఒంగోలులో విచారణకు హాజరు కానున్నారు.
- Advertisement -