Monday, January 20, 2025

అతిధులకు అయోధ్య మట్టి కానుక

- Advertisement -
- Advertisement -

లక్నో : ఈ నెల 22న అయోధ్యలో రామాలయ ప్రతిష్టాపన కార్యక్రమానికి వచ్చే అతిథులకు దేవాలయ మట్టిని రామరాజ్ పేరిట కానుకగా అందిస్తారు. ఆహుతులకు అయోధ్య ఆలయ పవిత్ర మట్టిని కానుకగా వితరణ చేస్తారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ వర్గాలు శనివారం తెలిపాయి. ఇక్కడి మట్టిని చిన్నపాటి సీసాలలో పెట్టి ఇవ్వడం జరుగుతుంది,

దీనితో పాటు అతిధులకు మోతీచూర్ లడ్డులను ప్రసాదంగా అందిస్తారని వివరించాయి. ప్రధాని నరేంద్ర మోడీకి జనుప సంచీలో చుట్టి ఉండే 15 మీటర్ల ఎతైన రామాలయ ఫోటోను బహుకరిస్తారు. ప్రత్యేకించి ఇక్కడికి వచ్చే 11వేల మందికి పైగా అతిధులకు విశిష్టమైన కానుకగా రామ్‌రాజ్ మట్టి బహుకరణ ఉంటుందని ట్రస్టు సభ్యులు కూడా ధృవీకరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News