Thursday, January 23, 2025

నటి తునీషా శర్మ ఆత్మహత్యపై రామ్ కదమ్ సంచలన వ్యాఖ్య

- Advertisement -
- Advertisement -

ముంబై: మహారాష్ట్రకు చెందిన సినిమా, సీరియల్ నటి తునీషా శర్మ ఆత్మహత్యపై బిజెపి ఎంఎల్ఏ రామ్ కదమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఆత్మహత్య వెనక లవ్ జిహాద్ కోణం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ కోణంలోనూ దర్యాప్తు జరుగుతోందని అన్నారు. దర్యాప్తులో అసలు విషయం వెల్లడవుతుందని, తునీషా కుటుంబ సభ్యులకు నూటికి నూరుశాతం న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఒకవేళ ఇది లవ్ జిహాద్ అయితే పోలీసులు ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తారని అన్నారు. దీని వెనకున్న కుట్రదారులు ఎవరు? ఏయే సంస్థలు ఉన్నాయన్న విషయాలు కూడా బయటపడతాయని పేర్కొన్నారు.

తునీషా ఆత్మహత్య కేసులో అరెస్ట్ అయిన సహ నటుడు షీజన్ మహమ్మద్ ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించినట్టుగా అతడిపై ఐపిసి 306 సెక్షన్ కింద అభియోగాలు నమోదయ్యాయి. షీజన్‌కు ముంబైలోని వాసాయ్ కోర్టు నాలుగు రోజుల పోలీసు కస్టడీకి ఆదేశించింది. కాగా, ‘అలీ బాబా: దాస్తాన్-ఈ-కాబూల్’ టీవీ షో సెట్స్‌లో తునీషా శర్మ నిన్న ఆత్మహత్య చేసుకుంది. తునీషా, ఖాన్ మధ్య రిలేషన్‌షిప్ ఉందని, వీరిద్దరూ రెండు వారాల క్రితం విడిపోయారని తునీషా తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె ఆత్మహత్యకు అదే కారణం కావొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News