- Advertisement -
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో హిందూ దేవాలయాల నిర్మాణశిల్పకళా సంప్రదాయాలను తెలిపే మ్యూజియం ఏర్పాటు కానుంది. ఇందుకోసం పాతిక ఎకరాల స్థలం ఎంపిక చేయనున్నారు. దేశంలోని పలు ప్రఖ్యాత హిందూ ఆలయాల నిర్మాణం, శిల్పకళా వైభవం సుసంపన్నంగా ఉంది. ఈ వివిధ రీతులను ఒకేచోట ప్రదర్శనశాలలో అంతా తిలకించేలా చేయడం ఈ ప్రాజెక్టు ఉద్ధేశం. అయోధ్యలో రామాలయం సందర్శనకు తెరిచిన తరువాత అత్యధిక సంఖ్యలో జనం వస్తుంటారని, వీరు అయోధ్యలో ఎక్కువ కాలం ఉండేలా చేసేందుకు సరికొత్త దర్శనీయ స్థలాలను రూపొందించాలని ప్రధాని సూచించారు. ఇందులో భాగంగా ఆలయ నిర్మాణ సంపద ప్రదర్శనాలయం గురించి కూడా ప్రతిపాదించారు. దీనికి అనుగుణంగానే ఈ ప్రాజెక్టును రూపొందించినట్లు అధికారులు తెలిపారు.
- Advertisement -