Wednesday, January 22, 2025

అయోధ్య గర్భగుడిలోకి చేరుకున్న రామ్‌లల్లా విగ్రహం…

- Advertisement -
- Advertisement -

అయోధ్యలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు జోరందుకున్నాయి. రామ్‌లల్లా విగ్రహం బుధవారం ఆలయ ప్రాంగణానికి చేరుకుంది. పూలతో అలంకరించిన పల్లకిలో మేళతాళాల మధ్య ఊరేగింపుగా రాములవారి విగ్రహం అయోధ్య ఆలయానికి చేర్చారు. జై శ్రీరామ్‌ నినాదంతో ఆలయ ప్రాంగణం దద్దరిల్లింది. గురువారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ గర్భగుడిలోకి రామ్‌లల్లా విగ్రహాన్ని తీసుకొచ్చారు. పెద్ద ఎత్తున జై శ్రీరాం అంటూ నినాదాలు చేస్తూ.. క్రేన్ సాయంతో శ్రీరాముడి విగ్రహాన్ని గర్భగుడి ప్రాంగణంలోకి చేర్చారు.

రామమందిరంలో జనవరి 22న శ్రీరాముని విగ్రహప్రతిష్ఠకు అన్ని ఏరాట్లు పూర్తయ్యాయి. మంగళవారం నుంచి ఇందుకు సంబంధించిన క్రతువులు ప్రారంభమయి 21వ తేదీవరకు నిరాఘాటంగా కొనసాగుతాయి.  జనవరి 21న రామ్‌లల్లా విగ్రహానికి 125 కలశాలతో అభిషేకం చేస్తారు. జనవరి 22న ప్రధాన ప్రాణప్రతిష్ఠ వేడుక మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రారంభమవుతుంది. రామ్‌లల్లా విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్ఠాపన చేస్తారు. చివరి రోజు జరిగూ మహోత్సవానికి150 దేశాలనుంచి భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది.దేశవ్యాప్తంగా 7 వేల మంది ప్రముఖులకు ఆలయ ట్రస్టు ఆహ్మావనాలు పంపింది.

రామమందిరం గురించి, ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాల గురించి తెలుసుకోవాలనుకునే భక్తుల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ‘దివ్య్ అయోధ్య’ యాప్ రూపొందించింది. ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని, ఆ వివరాలన్నీ తెలుసుకోవచ్చు.

రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కోసం రూపొందించిన ఆహ్వాన పత్రాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అయోధ్య ఆలయంలో ప్రతిష్ఠించబోయే బాలరాముడి విగ్రహ రూపాన్ని ఆహ్వాన పత్రికలపై ముద్రించారు. అయోధ్యకు వచ్చే అతిథుల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం టెంట్ సిటీని ఏర్పాటు చేసింది. దీనికి నిషాద్ రాజ్ అతిథిగృహం అని నామకరణం చేసింది. ఇందులో వేసిన గుడారాల్లో అతిథులు బస చేసేందుకు ఏర్పాట్లు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News