Thursday, January 23, 2025

అయోధ్య రాముడికి 8 అడుగుల బంగారు వన్నెల సింహాసనం

- Advertisement -
- Advertisement -

అయోధ్య : అయోధ్యలో రామమందిరం పనులు తుదిరూపు దిద్దుకుంటున్నాయి. వచ్చే ఏడాది జనవరి 22న ఆలయంలో దేవతామూర్తుల విగ్రహాలు ప్రతిష్ఠిస్తారు. గర్భగుడిలో శ్రీరాముడి విగ్రహాన్ని బంగారు పూత పూసిన ఎనిమిది అడుగుల ఎత్తు , నాలుగు అడుగుల వెడల్పుతో ఉన్న పాలరాతి సింహాసనంపై ఏర్పాటు చేయనున్నట్టు శ్రీరామ జన్మభూమి తీర్థ్‌ట్రస్ట్ తెలియజేసింది. రాజస్థాన్ లోని శిల్పులు ఈ సింహాసనాన్ని నిర్మిస్తున్నారని, డిసెంబర్ 15 నాటికి ఇది అయోధ్యకు చేరుకుంటుందని వివరించింది.

ఈ సింహాసనం 8 అడుగులు ఎత్తు, 3 అడుగుల వెడల్పు, ఉంటుంది. రామమందిరంలో మొదటి అంతస్తు డిసెంబర్ 15 నాటికి సిద్ధం అవుతుందని, ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయ్యాయని, మొదటి అంతస్తులో 17 పిల్లర్లు ఏర్పాటు చేశామని , మరో రెండింటిని త్వరలో ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. పరికర్మ మార్గ్ నిర్మాణం ఇప్పటికే పూర్తి కాగా, ప్రస్తుతం గృహ మండపం పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఈనెల చివరికల్లా రామమందిరం బయట ఉన్న ప్రధాన గేటు నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News