అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్టకు సర్వం సిద్ధమైంది. జనవరి 22వ తేదీ అంటే.. రేపు(సోమవారం) అయోధ్యలో ఈ మహోన్నతమైన కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం బాలరాముడి విగ్రహానికి 125 కలశాలతో స్నానం చేయించనున్నారు. అయోధ్యలో ఎక్కడా చూసినా.. ఆధ్యాత్మికశోభ కనిపిస్తోంది. రంగవళ్లులతో ముస్తాబు చేసిన లోగిళ్లతో అయోధ్య కళను సంతరించుకుంది. రామమందిరం ప్రారంభోత్సవానికి అయోధ్యకు వేలాది సాధువులు చేరుకుంటున్నారు. దేశంలోని వివిద ప్రాంతాల నుంచి వచ్చిన సాధవులకు తీర్థ క్షేత్రపురంలో బస ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో వేల సంఖ్యలో భక్తులు, అతిథులు కూడా పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. అయోధ్యలో ఏటీఎస్ కమాండోలు, పోలీసులు, సీఆర్ పీఎఫ్ జవాన్లతో కేంద్ర ప్రభుత్వం భారీ భద్రతను ఏర్పాటు చేసింది. డ్రోన్ జామర్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసి అధికారులు భద్రతను ఎప్పటికప్పుడు సమీక్షించనున్నారు.