Thursday, December 26, 2024

రామ్ లల్లా పేరు ఇక ‘బాలక్ రామ్’

- Advertisement -
- Advertisement -

విగ్రహం రూపు దృష్టా ఆ పేరు నిర్ణయం

అయోధ్య : సోమవారం (22న) అయోధ్యలోని బృహత్ ఆలయంలో ప్రాణ ప్రతిష్ఠ జరిగిన కొత్త రామ్ లల్లా విగ్రహాన్ని ఇక మీదట ‘బాలక్ రామ్’గా పిలవనున్నారు. నిల్చున్న స్థితిలోని ఐదు సంవత్సరాల బాలుని దైవ స్వరూపానికి ఆ పేరు ప్రతీకగా ఉంటుంది. ‘22న ప్రాణ ప్రతిష్ఠ జరిగిన శ్రీరాముని విగ్రహానికి ‘బాలక్ రామ్’గా నామకరణం చేయడమైంది. శ్రీరాముని విగ్రహానికి ‘బాలక్ రామ్’గా పేరు పెట్టడానికి కారణం ఆయన ఒక బాలుని పోలి ఉన్నారు.

ఆ బాలుని వయస్సు ఐదు సంవత్సరాలు’ అని ప్రాణ ప్రతిష్ఠ వేడుకతో సంబంధం ఉన్న అర్చకుడు అరుణ్ దీక్షిత్ తెలియజేశారు. ‘నేను మొదటిసారి విగ్రహాన్ని చూసినప్పుడు నేను ఉత్సుకతకు లోనయ్యాను. నా కళ్ల వెంబడి నీళ్లు కారసాగాయి. ఆ సమయంలో నేను పొందిన అనుభూతినివివరించడం నా శక్యం కాదు’ అని ఆయన చెప్పారు. వారణాసికి చెందిన ఆ అర్చకుడు ఇంత వరకు 50, 60 ప్రాణ ప్రతిష్ఠలు నిర్వహించారు. ‘నేను ఇంత వరకు నిర్వహించిన ప్రాణ ప్రతిష్ఠలు అన్నిటిలోకి ఇది అత్యంత అలౌకికం, సర్వోన్నతమైంది’ అని ఆయన తెలిపారు. తాను విగ్రహాన్ని తొలిసారి ఈ నెల 18న చూసినట్లు దీక్షిత్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News