Wednesday, January 22, 2025

అయోధ్య రాముని ప్రాణప్రతిష్టకు ముహూర్తం ఖరారు

- Advertisement -
- Advertisement -

జనవరి 22 మ. 12.20 గంటలు

అయోధ్య: అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామ మందిరంలో జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12.20 గంటలకు శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ట జరుగుతుందని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ సోమవారం ప్రకటించారు. మధ్యాహ్నం 12.20 గంటలకు శ్రీ రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టాపనకు ముహూర్తం ఖరారైందని విలేకరులకు ఆయన తెలిపారు.

ప్రజలు తమ ప్రాంతాలలోని రామాలయాలలో పూజలు నిర్వహించి, దేవుడికి హారతి ఇచ్చి, ప్రసాదాల వితరణ చేపట్టాలని, సూర్యాస్తమయం తర్వాత తమ ఇళ్ల మీద దీపాలను వెలిగించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ఈ మేరకు పిలుపుచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయోధ్యలో జరిగే శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటారు. సోమవారం అయోధ్యలో ప్రారంభమైన అక్షింతల పంపిణీ కార్యక్రమంలో చంపత్ రాయ్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News