జామ్‌నగర్(గుజరాత్): ప్రతిష్ఠాత్మక ప్రెసిడెంట్స్ కలర్ పురస్కారాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారం ఇండియన్ నావల్ షిప్(ఐఎన్‌ఎస్) వల్సురాకు ప్రదానం చేశారు. శాంతి పరిరక్షణ, యుద్ధ సమయంలో దేశానికి విశిష అందచేసిందుకు గుర్తింపుగా సైనిక విభాగానికి ప్రెసిడెంట్ కలర్‌ను ప్రదానం చేస్తారు. ప్రెసిడెంట్స్ కలర్ ప్రదానం సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి కోవింద్‌కు 150 మంది నౌకాదళ సిబ్బందితో గౌరవ వందనం నిర్వహించారు. 1942లో ఐఎన్‌ఎస్ వల్సురాను స్థాపించారు. భారతీయ నౌకాదళానికి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పడిన మొదటి సంస్థ ఇది. భారతీయ నౌకాదళం, కోస్తా గార్డు, మిత్ర దేశాలకు ఎలెక్ట్రికల్, ఎలెక్ట్రానిక్స్, వెపన్ సిస్టమ్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇక్కడ శిక్షణ ఇస్తారు.
LIVE: President Kovind presents President's Colour to INS Valsura at Jamnagar, Gujarat https://t.co/DAiv7IAi0o
— President of India (@rashtrapatibhvn) March 25, 2022