Tuesday, December 24, 2024

ఇటువంటి కథే చేయాలనుకున్నా

- Advertisement -
- Advertisement -

పవర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ సత్య పాత్రలో యువ కథానాయకుడు రామ్ పోతినేని నటించిన సినిమా ‘ది వారియర్’. తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ సినిమా ఈనెల 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ సందర్భంగా రామ్‌తో ఇంటర్వ్యూ విశేషాలు…

ఫ్రెష్‌నెస్ ఉండాలనేది నా ఫీలింగ్…
పోలీస్ కథ చేద్దామని నాలుగైదు కథలు విన్నాను. అన్నీ రొటీన్ అనిపించాయి. పోలీస్ కథలు చేస్తే ఫ్రెష్‌నెస్ ఉండాలనేది నా ఫీలింగ్. రొటీన్ కథలు విని వద్దని నిర్ణయించుకున్నాను. అయితే లింగుస్వామి కథ చెప్పడానికి వస్తానంటే సరేనన్నాను. అప్పుడు పోలీస్ కథ అని తెలియదు. కథ చెప్పే ముందు నాకు విషయం తెలిసింది. అయితే కథంతా విన్న తర్వాత ఇటువంటి కథే చేయాలని నిర్ణయించుకున్నా.
ఆ రోల్ చాలా ముఖ్యం…
దర్శకుడు లింగుస్వామి ఈ కథ చెప్పినప్పుడు ఆది పినిశెట్టి రోల్… గురు క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. సినిమాకు ఆ రోల్ చాలా ముఖ్యం. ఎవరు చేస్తున్నారు? అనేది టెన్షన్. అయితే లింగుస్వామి ఆది పేరు చెప్పినప్పుడు నేను చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఆది కూడా కథ విని వెంటనే ఈ సినిమాకు ఓకే చెప్పేశాడు.
ఆలోచించి మ్యూజిక్ డిజైన్ చేశాడు…
మ్యూజిక్ విషయంలో దేవిశ్రీ చాలా శ్రద్ధ తీసుకున్నారు. దేవితో నాకు ఏడో సినిమా ఇది. లింగుస్వామి స్క్రిప్ట్ చెప్పి వెళ్లిన తర్వాత దేవిశ్రీ నాకు ఫోన్ చేసి… రీ రికార్డింగ్ గురించి, సీక్వెన్సుల గురించి మాట్లాడాడు. ఇలా అంతకు ముందు ఎప్పుడు చెప్పలేదు. పాటలు కూడా కారు స్పీకర్‌లో సాంగ్స్ వినడం వేరు. ఇంట్లో వినడం వేరు. హెడ్ ఫోన్స్ పెట్టుకుని వినడం వేరు. థియేటర్‌లో వేరు. ఒక్కో స్పీకర్‌లో సాంగ్ ఎలా రావాలి? అని ఆలోచించి దేవిశ్రీ డిజైన్ చేశాడు.
స్క్రిప్ట్ కుదిరింది…

నేను ఎప్పటి నుంచో తమిళంలో చేయాలనుకుంటున్నాను. కథలు సెట్ కాలేదు. తమిళ్ నుంచి సూపర్ స్క్రిప్ట్ వచ్చాయి. కానీ అవి తెలుగులో తేడా కొడతాయేమో అనిపించింది. తెలుగు, తమిళ్… రెండు వర్కవుట్ అయ్యే స్క్రిప్ట్ దొరికితే చేద్దామనుకున్నాను. లింగుస్వామి చెప్పిన స్క్రిప్ట్ కుదిరింది.
అంకితభావం ఉంది…
వర్క్ మీద కృతిశెట్టికి చాలా అంకితభావం ఉంది. గౌరవం ఉంది. మనం చేసే పని మీద మనకు గౌరవం ఉంటేనే మిగతావన్నీ సెట్ అవుతాయి.
భారం అంతా ఆయన మీదే…
బోయపాటితో పాన్ ఇండియా సినిమా చేయడం హ్యాపీగా ఉంది. నా సినిమాలను హిందీ ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఆయన సినిమాలు కూడా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఒక హీరోను బాగా రీసెర్చ్ చేసిన తర్వాత ఆయన సినిమా చేస్తారు. అందుకని భారం అంతా ఆయన మీద వేశా.

Ram Pothineni interview about The Warrior

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News