Friday, January 24, 2025

‘ది వారియర్’ నాకు ఎమోషనల్ ఫిల్మ్: రామ్

- Advertisement -
- Advertisement -

పవర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో యువ కథానాయకుడు రామ్ పోతినేని నటించిన సినిమా ‘ది వారియర్’. తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహించారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. రామ్ సరసన కృతి శెట్టి నటించగా ఆది పినిశెట్టి విలన్ రోల్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో ఈనెల 14న భారీ ఎత్తున సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ‘ది వారియర్’ ఫస్ట్ టికెట్‌ను ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ కొనుగోలు చేశారు. ఆయనకు రాజమండ్రి ఎంపి మార్గాని భరత్ టికెట్ అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్, దర్శకుడు కిశోర్ తిరుమల, నిర్మాత వివేక్ కూచిభొట్ల తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రామ్ మాట్లాడుతూ.. “దర్శకుడు లింగుస్వామి చెప్పిన కథ విన్న తర్వాత… పోలీస్ కథ చేస్తే, ఇటువంటి కథ చేయాలనిపించింది. కథలో ఎమోషన్ అంతలా ఆకట్టుకుంది. నేను స్క్రిప్ట్ విన్న తర్వాత ఎప్పుడూ ట్వీట్ చేయలేదు. ఫస్ట్ టైమ్ ఈ సినిమాకు ట్వీట్ చేశా. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా కథ రాశానని లింగుస్వామి చెప్పారు. సత్య లాంటి పోలీస్ ఆఫీసర్లు చాలా మంది ఉన్నారు.‘ది వారియర్’ నాకు చాలా ఎమోషనల్ ఫిల్మ్‌” అని అన్నారు. చిత్ర దర్శకుడు లింగుస్వామి మాట్లాడుతూ “ఫస్ట్ టైమ్ స్ట్రెయిట్ తెలుగు సినిమా ‘ది వారియర్’ చేశా. వంద శాతం మంచి సినిమా కుదిరింది. థియేటర్లలో ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉంది. రామ్, దేవిశ్రీ, నేను… ముగ్గురం ఒకే ఎనర్జీతో ఉన్నాం. అందువల్ల ఇంత మంచి పాటలు వచ్చాయి” అని తెలిపారు. కృతి శెట్టి మాట్లాడుతూ “దర్శకుడిగా లింగుస్వామి డైమండ్ అని తెలుసు. ఆయన మనసు బంగారం. నాకు విజిల్ మహాలక్ష్మి రోల్ ఇచ్చినందుకు థాంక్స్‌” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మాజీ, సాయి మాధవ్ బుర్రా, సత్యనారాయణ, ఫైట్ మాస్టర్ విజయ్, సుజీత్ వాసుదేవ్ తదితరులు పాల్గొన్నారు.

Ram Pothineni speech at The Warrior 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News