Friday, January 10, 2025

‘రామ్’ అని రాసిన మేక అమ్మకానికి

- Advertisement -
- Advertisement -

నవీ ముంబై: ఓ మాంసం దుకాణం వద్ద ‘రామ్’ అని మరీ రాసి తెల్ల మేకను అమ్మకానికి పెట్టారు. అది కూడా ముస్లింల పండుగ బక్రీద్ కు ముందు. హిందువుల దేవుని పేరు రాసి మరీ ఈ మేకను అమ్మకానికి పెట్టారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాంతో నవీ ముంబై పోలీసులు మాంసం దుకాణం యజమానిపై కేసు నమోదు చేశారు.

ఇండియా టివి నివేదిక ప్రకారం మేకపోతు మీద పసుపు రంగుతో ‘రామ్’ అని రాశారు. దాంతో కొందరు హిందువులు గుమిగూడి మాంసం దుకాణం యజమానిని నిలదీశారు. కానీ పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కావాలనే హిందువులను అవమానించే ప్రయత్నం ‘గుడ్ లక్ మటన్ స్టోర్’ మాంసం దుకాణం యజమాని చేశాడని హిందువులు భావిస్తున్నారు.

బేలాపూర్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ రిజిష్టర్ నం. 123/2024 కింద కేసు బుక్కయిందని పోలీసులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News