Friday, November 22, 2024

ఆత్మనిర్భర్ కాన్సెప్ట్‌తో రామమందిర నిర్మాణం

- Advertisement -
- Advertisement -

అయోధ్య: అయోధ్యలో రామాలయాన్ని అత్మనిర్భర్ కాన్సెప్ట్‌తో నిర్మిస్తున్నట్లు రామజన్మభూమి ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మంగళవారం ఇక్కడ చెప్పారు. ఆలయంలో సీవేజ్, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు ఉంటాయన్నారు. వృద్ధులు, దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందీరాకుండా ఉండే విధంగా ఆలయప్రవేశం ఉంటుందన్నారు. రామాలయ కాంప్లెక్స్‌కు చెందిన లాండ్‌స్కేప్ ప్లాన్‌ను ఆయన మంగళవారం ట్రస్టు సభ్యులతో పంచుకున్నారు. 70 ఎకరాలున్న ఆలయంలోని 70 శాతం ప్రాంతం పచ్చికతో నిండి ఉంటుందని చెప్పారు. ఆలయ నిర్మాణం కోసం 392 పిల్లర్లను వాడినట్లు చంపత్ రాయ్ చెప్పారు.

14 ఫీట్ల వెడల్పుతో పెర్‌కోటాను తీర్చి దిద్దినట్లు చెప్పారు. ఇది సుమారు 272 మీటర్లు ఉంటుంది. ఫైర్ బ్రిగేడ్ పోస్టు కూడా ఆలయంలో ఉంటుందన్నారు. అగ్నిమాపక సిబ్బంది తమకు అవసరమైన నీటిని అండర్‌గ్రౌండ్ రిజర్వాయర్‌నుంచి తీసుకుంటారని ఆయన తెలిపారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం టెంపుల్ కాంప్లెక్స్‌లో లిఫ్ట్ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎంట్రన్స్ వద్ద రెండు ర్యాంపులను కూడా సిద్ధం చేస్తున్నారు.అయోధ్యలోని కుబేర తిల ప్రాంతంలో జటాయువు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు చంపత్ రాయ్ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News