Wednesday, January 22, 2025

అయోధ్య రామాలయ నిర్మాణం.. డిసెంబర్ చివరికి గ్రౌండ్ ఫ్లోర్ పూర్తి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : అయోధ్య రామాలయ మూడంతస్తుల నిర్మాణంలో గ్రౌండ్ ఫ్లోర్ డిసెంబర్ చివరి నాటికి పూర్తవుతుందని రామాలయ నిర్మాణ కమిటీ ఛైర్‌పర్సన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 22న ప్రాణప్రతిష్ఠ జరుగుతుందని, జనవరి 2224 మధ్య ఏరోజైనా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ పాల్గొంటారని తెలిపారు. ఏటా శ్రీరామనవమి రోజున గర్భాలయం లోని దేవతా విగ్రహాలపై సూర్యకిరణాలు ప్రసరించేలా దీన్ని డిజైన్ చేస్తున్నారని చెప్పారు. బెంగళూరులో శిఖర నిర్మాణం జరుగుతోందని, దీనికోసం రూర్కీ లోని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్, పుణె లోని మరో ఇన్‌స్టిట్యూట్ కలిసి కంప్యూటరైజ్డ్ ప్రోగ్రాం రూపకల్పన చేస్తున్నారని చెప్పారు.

ఆలయం గర్భగుడిలో రామ్‌లల్లా విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేసే కార్యక్రమానికి ప్రధాని మోడీని లాంఛనంగా శ్రీరామ్ జన్మభూమి ట్రస్ట్ ఆహ్వానించనుంది. జనవరి 14 మకరసంక్రాంతి తర్వార ఈ కార్యక్రమం ప్రారంభంపై నిర్ణయం తీసుకోనుంది. జనవరి 24 నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఆహ్వానితులకు సంబంధించి సాధువులు, సంతులు, రామాలయ ఉద్యమంతో ముడిపడి ఉన్న వ్యక్తులతోసహా దాదాపు 10 వేల మందితో ప్రాథమిక జాబితా సిద్ధం చేస్తున్నామని మిశ్రా తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News