Friday, November 22, 2024

ఆ మూడింటిలో ఏ విగ్రహంతో ప్రాణ ప్రతిష్ట..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : అయోధ్యలో రామమందిరం వచ్చే నెల 22న ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ రామమందిరంలో ప్రతిష్టించే కీలకమైన రామ్ లల్లా విగ్రహంపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇందుకోసం ముగ్గురు శిల్పులు మూడు వేర్వేరు రూపాల్ని చెక్కుతున్నారు. జనవరి 22న అయోధ్య రామమందిరం గర్భగుడిలో ప్రతిష్టించే అత్యుత్తమ రామ్ లల్లా విగ్రహాల రేసులో దీన్నిబట్టి మూడు శిల్పాలు ఉన్నాయి. వీటిని మేటి శిల్పులు గణేష్ భట్, అరుణ్ యోగిరాజ్, సత్యనారయణ్ పాండే చెక్కుతున్నారు. ఈ మూడు శిల్పాల్లో అత్యుత్తమమైన దానికి ఎంపిక చేసి గర్భగుడిలో ప్రతిష్టించబోతున్నారు. దీంతో ఈ మూడు విగ్రహాలపైనే ఇప్పుడు అందరి దృష్టీ నెలకొంది. రామమందిరం ప్రారంభం అయ్యాక భక్తులు కొన్ని తరాల పాటు దర్శించుకునే విగ్రహాలు కాబట్టి వీటికి అంత ప్రాధాన్యం ఏర్పడింది.

అయోధ్య రామమందిర గర్బగుడిలో ప్రతిష్టాపన కోసం మొత్తం మూడు విగ్రహాలు పోటీలో ఉన్నప్పటికీ వాటిలో అత్యుత్తమ శిల్పాన్ని గర్భగుడిలో ఉంచాక మిగిలిన రెండు శిల్పాల్ని కూడా గుడిలోని వేర్వేరు ప్రాంతాల్లో ప్రతిష్టిస్తారు. అయితే వీటిలో ఏ విగ్రహం గర్భగుడిలో ప్రాణప్రతిష్ట చేస్తారు, మిగిలిన రెండు విగ్రహాలు ఎక్కడెక్కడ ఉంచబోతున్నారనే దానిపై ఆలయ ట్రస్టు త్వరలోనే ఓ ప్రకటన విడుదల చేయబోతోంది. జనవరి 22న రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతున్నా దానికి వారం రోజుల ముందే అంటే జనవరి 16నుంచి సంప్రదాయ కార్యక్రమాలు మొదలవుతాయి. వీటిని పూజారులు గణేశ్వర్ శాస్త్రి ద్రావిడ్, లక్ష్మీకాంత్ దీక్షిత్ నిర్వహిస్తారని ఆలయ ట్రస్టు వర్గాలు తెలిపాయి. ఇందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News