Monday, April 7, 2025

రాముడు దేవుడు కాడు.. పాత్రనే

- Advertisement -
- Advertisement -
Ram Was Not God Says Jitan Ram Manjhi
బీహార్ బిజెపి మిత్రపక్ష నేత జితన్

పాట్నా : శ్రీరాముడు దేవుడు కాడని, ఆయన తులసీదాస్, వాల్మీకీల కథలో కల్పిత పాత్ర అని బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ వ్యాఖ్యానించారు. వారు తమ సందేశాలను ఈ పాత్ర ద్వారా లోకానికి విన్పించారని అన్నారు. బీహార్‌లో బిజెపి మిత్రపక్షానికి చెందిన జితన్ రామ్ చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీలో ప్రకంపనలకు దారితీశాయి. సాహితీకారులు రామాయణాన్ని రాశారని, వారు లోకానికి మంచిని తమ రచనలతో ప్రబోధించారని, ఈ క్రమంలో రాముడి పాత్రకు ప్రాణప్రతిష్ట జరిగిందని, అంతేకానీ రాముడు దేవుడు అని చెప్పడం కుదరదని తేల్చివేశారు. సీనియర్ మాంఝీ కుమారుడు సంతోష్ మాంఝీ నితీష్ కుమార్ కేబినెట్‌లో మంత్రిగా ఉన్నారు. మాజీ సిఎం అయిన మాంఝీ సొంతంగా బీహార్‌లో హిందూస్థాన్ అవామ్ మోర్చా (హామ్) ప్రాంతీయ పార్టీని స్థాపించారు. హామ్ ఇక్కడి ఎన్‌డిఎ కూటమిలో మిత్రపక్షంగా ఉంది. బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవ సభలో మాట్లాడుతూ మాంఝీ రాముడు దేవుడు కాడని చెప్పడంతో బిజెపి వర్గాలు రగిలిపోతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News