Monday, December 23, 2024

క్రికెట్ జట్టును కొనుగోలు చేసిన రామ్ చరణ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టాలీవుడ్ నటుడు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్‌కు తోడుగా కియారా అద్వానీ నటిస్తున్నారు.  ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్‌లో కాస్తా విరామం దొరకడంతో ముంబయిలో శ్రీ మహాలక్ష్మీ ఆలయాన్ని రామ్ తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. తన ముద్దుల కూతురుతో కలిసిన ఫొటోలు వైరల్‌గా మారాయి.  ఎయిర్ లైన్‌తో రామ్ చరణ్ వ్యాపారం చేస్తున్నారు. ఐఎస్‌పిఎల్‌లో టోర్నీలో హైదరాబాద్ జట్టును రామ్ చరణ్ కొనుగోలు చేశారు. ఆసక్తి కలిగిన ఆటగాళ్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెర్రీ కోరారు. అద్భతమైన లీగ్‌తో తనతో పాటు పంచుకోవాలని పోస్ట్ చేశారు. దీంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఖాళీ సమయం దొరకడంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా రామ్ చరణ్ కలిశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News