Tuesday, January 21, 2025

అది కనిపించడం లేదా హరీష్ రావు?: రామకృష్ణ

- Advertisement -
- Advertisement -

అమరావతి: అప్పులో ఎపి అభివృద్ధి సాధించిన విషయం తెలంగాణ మంత్రి హరీష్ రావు తెలియాదా? అంటూ సిపిఐ నేత రామకృష్ణ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలకు సిపిఐ రామకృష్ణ స్పందించారు. సిపిఐ నేత రామకృష్ణ జగన్ ప్రభుత్వంపై పరోక్ష విమర్శలు చేశారు. దేశంలో సిఎం జగన్ మోహన్ రెడ్డిని మించిన ధనిక సిఎం ఎవరైనా ఉన్నారా? అని అడిగారు. అదానీకి పోర్టులు, విద్యుత్ ఒప్పందాలు, వేలాది ఎకరాల భూములు కట్టబెట్టి.. అదానీని అభివృద్ధి చేయడం హరీష్ రావుకు కనిపించడం లేదా? అని ఎద్దేవా చేశారు. కేంద్ర మెడలు వంచి ప్రత్యేక హోదా… విభజన హామీలు అమలు సాధిస్తామని, జగన్ మాట తప్పి మడమ తిప్పిన విషయం హరీష్ రావుకు తెలియదా? అని ప్రశ్నించారు.

Also Read: ఎపి ప్రజలను గాలికొదిలేశారు: మంత్రి హరీశ్ రావు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News