Monday, December 23, 2024

రొమాంటిక్ లవ్లీ మెలోడీ

- Advertisement -
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, రవితేజ టీం వర్క్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సామ్ సిఎస్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి మొదటి పాట ‘బుల్ బుల్ తరంగ్’ని ఈనెల 10న చిత్ర బృందం విడుదల చేయనుంది. రవితేజ, రజిషా విజయన్‌పై చిత్రీకరించిన లవ్లీ సాంగ్ ఇది. ఈ రొమాంటిక్ లవ్లీ మెలోడీలో రవితేజ, రజిషాల కెమిస్ట్రీ చూడముచ్చటగా ఉంటుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో రవితేజ, రజిషా జోడి బ్యూటిఫుల్, స్టయిలిష్‌గా వుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News