Monday, December 23, 2024

రామారావు ఆన్ డ్యూటీ టీజర్ విడుదల

- Advertisement -
- Advertisement -

Rama Rao on Duty teaser released

 

సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో ఎస్ ఎల్ వి సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు ఆర్ టి టీమ్‌వర్క్స్‌పై నూతన దర్శకుడు శరత్ మండవ దర్శకత్వం వహించిన మాస్ మహారాజా రవితేజ యాక్షన్ థ్రిల్లర్ `రామారావు ఆన్ డ్యూటీ` నిర్మాణ ప్రక్రియ చివరి దశలో ఉంది. ఇప్పటికే రెండు పాటలు మినహా సినిమా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయింది. మహా శివరాత్రి సందర్భంగా మంగ‌ళ‌ వారం నాడు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. రవితేజ సిన్సియర్ డ్యూటీ మైండెడ్ డిప్యూటీ కలెక్టర్‌గా చురుకైన పాత్రలో క‌న్పించారు, అతను చట్టానికి విరుద్ధంగా వున్న ఎవరినీ లెక్క‌చేయ‌డు. టీజర్‌లో మరొక వైపు మంచి చేయ‌డానికి వెనుకాడ‌ని కోణం కూడా క‌నిపిస్తుంది.

మాస్‌ని ఆకట్టుకునేలా, టీజర్‌లో పుష్కలంగా యాక్షన్ స‌న్నివేశాలు ఉన్నాయి. రవితేజ ఆద్యంతం ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తాడు. హీరోయిన్లిద్దరూ హోమ్లీ గెటప్‌లలో కనిపించారు. వేణు తొట్టెంపూడి క్యారెక్టర్‌కి ఊతమిచ్చే డైలాగ్‌ చెప్పాడు. నిజానికి టీజర్‌లో కొన్ని పవర్‌ఫుల్ డైలాగ్స్ ఉన్నాయి. ప్రత్యేకించి, రవితేజ  చెప్పిన “నేరస్థులకు త‌ప్ప‌కుండా శిక్ష ప‌డుతుంది. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోయినా స‌రే” అని ర‌వితేజ‌లోని నిష్పాక్షిక‌మైన కేరెక్ట‌ర్‌ను సూచిస్తుంది. సినిమాటోగ్రాఫర్ సత్యన్ సూర్యన్ ఐఎస్ సి, సంగీత దర్శకుడు సామ్ సిఎస్ పనితనం ఒకదానికొకటి వ‌న్నె తెచ్చాయి. ప్రవీణ్ కెఎల్ పదునైన ఎడిటింగ్ స్పష్టంగా కనిపిస్తుంది. టీజర్ ఖచ్చితంగా అంచనాలను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News