Monday, December 23, 2024

మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట

- Advertisement -
- Advertisement -

మాచో స్టార్ గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో వస్తున్న ’రామబాణం’తో హ్యాట్రిక్‌ని పూర్తి చేయనున్నారు. హీరోయిన్ శ్రీలీల ’రామబాణం’ థర్డ్ సింగిల్ లిరికల్ వీడియోని లాంచ్ చేశారు. మిక్కీ జె మేయర్ ఈ పాటని మైమరపించే ట్రాక్‌గా కంపోజ్ చేశారు.

ఇటు మెలోడి అటు బీట్ రెండిటిని అద్భుతంగా బ్యాలెన్స్ చేస్తూ… మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ఈ పాటని స్వరపరిచారు. కోల్‌కతా నేపథ్యంలో సాగే ఈ పాటలో విజువల్స్ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి. గోపీచంద్, డింపుల్ హయాతి అందంగా కనిపించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 5న విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News