Friday, January 10, 2025

Cinema: ‘రామబాణం’ ట్రైలర్ వచ్చేసింది..

- Advertisement -
- Advertisement -

మాచో హీరో గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన మూడో చిత్రం ‘రామబాణం’. ఇందులో గోపిచంద్ కు జోడీగా డింపుల్ హయాతీ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా మే 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను ప్రారంభించింది. ఇందులో భాగాంగా మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు.

యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందించిన ఈ సినిమా ట్రైలర్ అభిమానులతోపాటు సినీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. కాగా, ఈ సినిమాలో జగపతి బాబు, ఖుష్బూ, సచిన్ ఖేడేకర్, నాజర్, అలీ, వెన్నెల కిశోర్, గెటప్ శీను, సత్య, సప్తగిరి తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి భూపతి రాజా కథను అందించగా, మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News