Tuesday, January 7, 2025

మున్సిపల్ వైస్ చైర్మన్ ను కొట్టిన మంత్రి అనుచరుడు… ఆత్మహత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

అమరావతి: కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో వైసిపిలో వర్గపోరు కొనసాగుతోంది. మంత్రి వేణు అనుచరుడు ఉదయ్ మున్సిపల్ వైస్ చైర్మన్ శివాజీని కొట్టాడు. సోమవారం జరిగిన సమావేశానికి ఎందుకు వెళ్లావంటూ శివాజీపై ఉదయ్ చేయి చేసుకున్నాడు. రామచంద్రాపురంలో మంత్రి వేణుకు వ్యతిరేకంగా ఎంపి బోస్ వర్గీయులు సమావేశమయ్యారు. మంత్రి వేణు ఎదుటే మున్సిపల్ వైస్ ఛైర్మన్‌పై చేయి చేసుకోవడంతో రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తుంది. అనుచరుడు ఉదయ్‌ను మంత్రి చెల్లుబోయిన వేణు వారించారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో మంత్రి వేణు ఎదుటే ఈ దాడి జరగడం కొసమెరుపు. ఉదయ్ కొట్టాడన్న మనస్తాపంతో శివాజీ చీమల మందు తాగాడు. ప్రస్తుతం రామచంద్రాపురం ప్రభుత్వాస్పత్రిలో శివాజీ చికిత్స పొందుతున్నాడు.

Also Read: ఆ నాలుగు జిల్లాల్లో పల్లెవెలుగు టౌన్ బస్‌పాస్‌

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News