Thursday, January 23, 2025

ఘనంగా రంజాన్ పండుగ

- Advertisement -
- Advertisement -

Ramadan celebrations in Hyderabad 2022

హైదరాబాద్: రంజాన్ పండుగను ముస్లిం సోదరులు భక్తి శ్రద్దలతో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక నమాజ్ తర్వాత ఒక్కకొక్కరూ ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలను తెలుపుకున్నారు. సామూహిక నమాజ్‌లకు నగరంలోని ప్రధాన మసీదుల వద్ద ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఈ పండుగ చార్మినార్ మక్క మసీదుతో పాటు మీరాలం ఈద్గా వద్ద వేలాది మంది ముస్లిం సోదరులు సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా చార్మినార్‌తో పాటు వివిధ మసీదుల వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పాత బస్తీలోని సున్నితమైన, సమస్యత్మకమైన ప్రాంతాల్లో రాపిడ్ యాక్షన్ బలగాలతో రంగంలోకి దించిన పోలీసులు ఎక్కడికక్కడ ప్రత్యేక భద్రత చర్యలు తీసుకున్నారు. నమాజ్ వచ్చే వారిని క్షుణంగా తనిఖీ చేసి లోపలికి పంపారు.

ఎక్కడా ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ప్రధాన మసీదులు ప్రార్థనలు చేసే మైదానాల ప్రాంతాల్లో నమాజ్ సమయం ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నగరంలోని ముషీరాబాద్, బోలక్‌పూర్, బలంరాయి, సనత్ నగర్, బోయిన్‌పల్లి, తిరుమల్ గిరి, లాల్ బజార్, బొల్లారం తదితర ప్రాంతాల్లోని మసీదులు, ఈద్గాల్లో ముస్లీం సోదరులు ప్రత్యేక నమాజ్‌లు నిర్వహించారు. నమాజ్ అనంతరం ముస్లిం సొదరులకు తమ తమ నియోజకవర్గాలు, డివిజన్లల్లో ఎమ్మెల్యేలు, కార్పోరేటర్లు, వివిధ రాజకీయ పార్టీల నాయకులతో పాటు అన్ని వర్గాల ప్రజలు పండుగ శుభాకాంక్షలను తెలిపారు. అనంతరం మిఠాయిలను పంచుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News