- Advertisement -
మన తెలంగాణ / హైదరాబాద్ : ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ ఉపవాస దీక్షలు ఈ నెల 12 నుండి ప్రారంభమవుతున్నాయి. సౌది అరేబియా దేశంలో ఆదివారం నెలవంక దర్శనమిచ్చింది. దీంతో అక్కడ సోమవారం నుండి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభమవుతున్నాయి. భారత దేశంలో మాత్రం మంగళవారం నుండి రంజాన్ ప్రారంభమవుతుంది. రంజాన్ నెల ప్రారంభంతో సోమవారం నుండి రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు (తరావీ నమాజ్) సోమవారం నుండి ప్రారంభమవుతాయి. నెల రోజుల పాటు ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలు పాటిస్తారు. ప్రత్యేక ప్రార్థనలు, ఖురాన్ పఠనంతో గడుపుతారు. ఫిత్రా, జకాత్ , దాన ధర్మాలతో పేదలకు సహాయం అందిస్తారు.
- Advertisement -