Friday, December 20, 2024

ఘనంగా రంజాన్ పండుగ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంజాన్ పండుగ (ఈద్ ఉల్ ఫితర్)ను ముస్లిం సోదరులు భక్తి శ్రద్దలతో ఘనంగా జరుపుకున్నారు. ప్రార్థనల అనంతరం ఈద్గాలు, మసీదుల వద్ద ముస్లిం సోదరులకు హిందు సోదరులు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పండుగ సందర్భంగా గంగ జమున తైజీబ్‌కు ఆలవలమైన హైదరాబాద్ నగరంలో అధ్యాత్మిక వాతావరణం వెల్లవిరిసింది. పండుగ సందర్భంగాముస్లిం సోదరులు మసీదులు, ఈద్గాలు, దర్గాలో ప్రత్యేక నమాజ్ చేశారు. ఆ తర్వాత ఒక్కకొక్కరూ ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలను తెలుపుకున్నారు.

సామూహిక నమాజ్‌లకు నగరంలోని ప్రధాన మసీదుల వద్ద ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాటు చేశారు. కేపీహెచ్‌బీ కాలనీలో ఉన్న ఈద్గాలో మంత్రి మహమూద్ అలీ, ఆయా ప్రాంతాల్లో జరిగిన ప్రార్థనల్లో స్థానిక ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు కార్పొరేటర్లు, పాల్గోన్నారు. చార్మినార్ మక్క మసీదుతో పాటు మీరాలం ఈద్గా వద్ద వేలాది మంది ముస్లిం సోదరులు సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా చార్మినార్‌తో పాటు వివిధ మసీదుల వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

పాత బస్తీలోని సున్నితమైన, సమస్యత్మకమైన ప్రాంతాల్లో రాపిడ్ యాక్షన్ బలగాలతో రంగంలోకి దించిన పోలీసులు ఎక్కడికక్కడ ప్రత్యేక భద్రత చర్యలు తీసుకున్నారు. ప్రధాన మసీదులు ప్రార్థన మైదానాల ప్రాంతాల్లో నమాజ్ సమయం ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నగరంలోని కూకట్‌పల్లి, కెపిహెచ్‌బి, కుత్బుల్లాపూర్, బోయిన్‌పల్లి, తిరుమల్ గిరి, లాల్ బజార్, బొల్లారం, ముషీరాబాద్, బోలక్‌పూర్, బలంరాయి, సనత్ నగర్, తదితర ప్రాంతాల్లోని మసీదులు, ఈద్గాల్లో ముస్లీం సోదరులు ప్రత్యేక నమాజ్‌లు నిర్వహించారు.నమాజ్ అనంతరం మిఠాయిలను పంచుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News