Wednesday, January 22, 2025

రంజాన్ ఫుడ్ కార్నివల్ ‘మహఫిల్-ఇ-జైఖా’

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ముస్లింలకు పవిత్ర మాసమైన రంజాన్ సందర్భంగా హైదరాబాద్ లోని గుడిమల్కపూర్ లో ఉన్న కింగ్స్ క్లాసిక్ గార్డెన్ లో 12 రోజుల పాటు ‘మహఫిల్-ఇ-జైఖా’ నిర్వహించబోతున్నారు. దీనిని ఫుడ్ బ్లాగర్లు ఆయెషా సుల్తానా, హస్నయిన్ ఉల్-హఖ్, మజాజ్ హుసైన్,ముజ్తబా హుసైన్ తాలూకు పరివార్ గ్రూప్ తో కలిసి ఈ గొప్ప వంటకాల వేడుకను నిర్వహిస్తున్నారు. ఈ భోజన ఈవెంట్ కు అందరూ ఆహ్వానితులే. అందరికీ ఉచిత ప్రవేశం.  రంజాన్ మాసం సందర్భంగా భోజన ప్రియులు తమకు నచ్చిన వంటకాన్ని ఇక్కడ ఆరగించవచ్చు.

ఈ రంజాన్ పాకశాల ఈవెంట్ లో నోరూరించే హలీమ్, కునాఫా, బిర్యానితో పాటు అఫ్గానీ, రాజస్థానీ, చైనీస్, దక్షిణ భారత వంటకాలను కూడా అందించనున్నారు. భోజన ప్రియులకు ఈ ఈవెంట్ సంతృప్తినివ్వనున్నది. దీనికి తోడు 50 వంటకాలతో ‘మెహఫిల్-ఇ-షెహరి’ ని కూడా నిర్వహించబోతున్నారు. ఇందులో హైదరాబాద్ కు చెందిన కిచిడి, ఖీమా, గుర్దా, తదితరాలు అందించనున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు ఇది ఉండనున్నది.

ఏప్రిల్ 1న ఈ కార్నివల్ కు బిగ్ బాస్ 17 విన్నర్, ప్రముఖ స్టాండప్ కమేడియన్ మునవర్ ఫారూఖీ హాజరై, అభమానులు, ఫాలోయర్లతో ఇంటరాక్ట్ కానున్నారు. దీనికి తోడు ఏప్రిల్ 5న తెలుగు నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ హాజరు కానున్నారు.

Farooqi

Bellamkonda

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News