Monday, January 20, 2025

శాంతియుతంగా రంజాన్ వేడుకలు జరుపుకోవాలి

- Advertisement -
- Advertisement -

కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి
రాచకొండ సిపి డిఎస్ చౌహాన్

హైదరాబాద్: రంజాన్ వేడుకలను ముస్లిం సోదరులు శాంతియుతంగా జరుపుకోవాలని రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ అన్నారు. నేరెడ్‌మెట్‌లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో శుక్రవారం రంజాన్ వేడుకలపై పోలీస్ అధికారులతో సిపి డిఎస్ చౌహాన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి డిఎస్ చౌహాన్ మాట్లాడుతూ రంజాన్ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రజలు శాంతియుతంగా, సంతోషంగా వేడుకలు జరుపుకోవాలని, పోలీసులకు సహకరించాలని కోరారు. ముస్లిం సోదరులు భారీ సంఖ్యలో పాల్గొనే సామూహిక ప్రార్థనల సమయంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరారు. సమర్థవంతమైన అధికారులకు విధులు అప్పగించాలని అన్నారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ బందోబస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు. ఆయా ప్రాంతాల్లోని సిసిటివిలను పరిశీలించాలని ఆదేశించారు.

సామూహిక ప్రార్థనల సమయంలో ట్రాఫిక్ జాం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, సాధారణ ప్రజలు ఇబ్బందులకు పడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో మతసామరస్యం కాపాడడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కమిషనర్ సత్యనారాయణ, ఎస్‌బి డిసిపి బాలస్వామి, ఎసిపి జావేద్, ఎసిపి జగదీష్‌చందర్, ఎసిపిలు, ఇన్స్‌స్పెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News