Wednesday, January 22, 2025

శుక్రవారం నుంచి రంజాన్ మాసం ప్రారంభం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకునే రంజాన్ మాసం శుక్రవారం నుండి ప్రారంభం కానుంది. బుధవారం దేశంలో ఎక్కడా నెలవంక కనిపించలేదు. దీంతో శుక్రవారం నుండి రంజాన్ మాసం ప్రారంభమవుతుందని ముస్లిం మత పెద్దలు నిర్ణయించారు.

గురువారం రాత్రి నుంచి మసీదులలో ‘తరావీహ్’ ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభం కానున్నాయి. శుక్రవారం నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభం అవుతాయని మత పెద్దలు పేర్కొన్నారు. నెల రోజుల పాటు ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్దలతో ఉపవాస దీక్షలు పాటిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News