Wednesday, January 22, 2025

నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

Ramadan traffic restrictions in hyderabad

రంజాన్ ప్రార్థనలకు ఆంక్షలు విధింపు
ఆదేశాలు జారీ చేసిన జాయింట్ సిపి రంగనాథ్

హైదరాబాద్: రంజాన్ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ జాయింట్ పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ ఎవి రంగనాథ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ దుల్ ఫితార్(రంజాన్) ముస్లిం సోదరులు మీరాలం ట్యాంక్ ఈద్గా, హాకీ గ్రౌండ్, మాసబ్ ట్యాంక్ వద్ద ముస్లిం సోదరులు ఈనెల 2,3 తేదీలో ప్రార్థనలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పలు ప్రాంతాల్లో వాహనాలను డైవర్ట్ చేశారు. వాహనదారులు ట్రాపిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయమార్గల్లో వెళ్లాలని పోలీసులు కోరారు.

మీరాలం ట్యాంక్ ఈద్గా…
నమాజ్ చేసేందుకు పురాణాపూల్, కమాటిపుర, కిషన్‌బాగ్ నుంచి ఈద్గా, మీరాలం ట్యాంక్ వచ్చే వాహనాలను బహదురుపుర ఎక్స్ రోడ్డు నుంచి ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటలకు వరకు రావాలి. ప్రార్థనలకు వచ్చే వారు వాహనాలను జూపార్క్, ఓపెన్ స్పేస్ మజీద్ అల్లా హో అక్బర్ వద్ద పెట్టాలి. సాధారణ వాహనాలను ఈద్గా, తాడ్‌బండ్ వచ్చే వాహనాలకు అనుమతి లేదు. శివరాంపల్లి, దానమ్మ హట్స్ మీదుగా ఈద్గా, మీరాలం ట్యాంక్‌కు వచ్చే వారు దానమ్మ హట్స్ ఎక్స్ రోడ్డు మీదుగా రావాలి. సాధారణ వాహనాలకు అనుమతి లేదు. ప్రార్థనలకు వచ్చే వారు మోడ్రన్ సామిల్ , మీర్‌ఆలం ఫిల్టర్ బెడ్, సుఫీ కార్స్, యాదవ్ పార్కింగ్ వద్ద వాహనాలను పెట్టాలి. కాలాపత్తర్ మీదుగా ఈద్గా మీరాలం ట్యాంక్‌కు వచ్చే వారు కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ నుంచి రావాలి. సాధారణ వాహనాలను అనుమతించరు. కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ మీదుగా మోచీ కాలనీ, బహదుర్‌పుర, శంషేర్‌గంజ్, నవాబ్ సాహెబ్ కుంట మీదుగా వెళ్లాలి. వాహనాలను భయ్యా పార్కింగ్, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్, విశాఖ సిమెంట్ షాప్ పక్కన ఉన్న బిఎన్‌కు కాలనీలో పార్కింగ్ చేయాలి. పురానాపూల్ నుంచి బహదురుపురాకు వచ్చే ఆర్టిసి బస్సులను పురాణాపూల్ దర్వాజ మీదుగా జియాగూడ, సిటీ కాలేజీ వైపు మళ్లించారు. శంషాబాద్, మైలార్‌దేవ్‌పల్లి, రాజేంద్రనగర్ నుంచి బహుదూర్‌పుర వైపు వచ్చే వాహనాలను ఆరాంఘర్ జంక్షన్ వద్ద నుంచి శంషాబాద్, రాజేంద్రనగర్ వైపు మళ్లిస్తారు.

హాకీ గ్రౌండ్, మాసబ్ ట్యాంక్…

హాకీ గ్రౌండ్, మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ వద్ద ముస్లిం సోదరులు ప్రార్థనలు చేసేందుకు వీలుగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మెహిదీపట్నం, లకిడికాపూల్ వైపు వాహనాలను కేవలం ఫ్లైఓవర్‌పై నుంచి మాత్రమే అనుమతిస్తారు. ప్రార్థనలు ముగిసే వరకు ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. మెహిదీపట్నం మీదుగా రోడ్డు నంబర్1, బంజారాహిల్స్ వయా మాసబ్ ట్యాంక్ వచ్చే వాహనాలను ఆయోధ్య జంక్షన్, ఖైరతాబాద్, ఆర్టిఏ ఆఫీస్, ఖైరతాబాద్ లెఫ్ట్ టర్న్ తీసుకుని తాజ్ కృష్ణా హోటల్ వైపు వెళ్లాలి. లకిడికాపూల్ మీదుగా మాసబ్‌ట్యాంక్ వచ్చే వాహనాలను ఆయోధ్య జంక్షన్ మీదుగా నిరంకారీ, ఖైరతాబాద్, వివి స్టాట్యూ, ఖైరతాబాద్ ఆర్టి ఆఫీస్, తాజ్ కృష్ణా హోటల్ వైపు మళ్లిస్తారు. మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ కిందకు వాహనాలకు అనుమతి లేదు. రోడ్డు నంబర్12 నుంచి బంజారాహిల్స్ వచ్చే వాహనాలను మాసబ్ ట్యాంక్ వచ్చే వాహనాలను రోడ్డు నంబర్ 1,12 జంక్షన్ మీదుగా తాజ్‌కృష్ణా హోటల్ వద్ద రైటర్న్ తీసుకుని ఆర్టి ఖైరతాబాద్‌వెళ్లాలి. ఎన్‌ఎఫ్‌సిఎల్ జంక్షన్, పంజాగుట్ట నుంచి వచ్చే వాహనాలను మాసబ్‌ట్యాంక్ అనుమతివ్వరు, తాజ్‌కృష్ణ హోటల్, ఎర్రమంజిల్ కాలనీ, ఆర్టిఏ ఖైరతాబాద్, నిరంకారీ, లకిడికాపూల్, మాసబ్‌ట్యాంక్ ఫ్లైఓవర్, మెహిదీపట్నం వైపు మళ్లిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News