Thursday, January 23, 2025

అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా రామగుండం

- Advertisement -
- Advertisement -

గోదావరిఖని: అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా రామగుండం నియోజక వర్గాన్ని మారుస్తున్నామని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గురువారం 2 కోట్ల సిఎం ప్లాంట్ గ్రాండ్ నిధులతో నిర్మాణం చేస్తున్న నూతన రోడ్డును స్థానిక తిలక్ నగర్‌లో ఎమ్మెల్యే పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్‌బినగర్ చౌరస్తా నుంచి తిలక్ నగర్ డౌన్ వరకు రోడ్డు ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారడం తో ఇటీవలనే రోడ్డు నిర్మాణం చేపడుతామని ప్రజలకు హామీ ఇవ్వడం జరిగిందని, ఈ రోడ్డు నిర్మాణం చేసి మాట నిలుపుకున్నామని అ న్నారు.

రామగుండం కార్పొరేషన్ పరిధిలో ప్రతి డివిజన్‌ను సుందరంగా తీర్చిదిద్ధుతున్నామని అన్నారు. కార్యక్రమంలో రామగుండం మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, కార్పొరేటర్లు దొంత శ్రీనివాస్, అయిత శివ కుమార్, నాయకులు జెవి రాజు, బొడ్డు రవీందర్, చేతుల కోటేశ్వర్ తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News