Friday, November 15, 2024

రామగుండం బి థర్మల్ పవర్ ప్లాంట్‌ను విస్తరణ చేయాలి

- Advertisement -
- Advertisement -

రామగుండం: 62.5 మెగవాట్ల రామగుండం బి థర్మల్ పవర్ ప్లాంట్‌ను 350 మెగవాట్ల లేదా 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్ విస్తరణ చేయాలని 20వ డివిజన్ కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌కు ఆయన వినతి అందజేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ రామగుండం బి థర్మల్ విద్యుత్ కేంద్రంను విస్తరణ చేయాలనేదే ఇక్కడి ప్రజల ఆకాంక్షని, గతంలో అప్పటి ఆంధ్ర పాలకులు నిర్లక్షంకు నిరసనగా బి థర్మల్ విస్తరణ చేయాలనే డిమాండ్ అన్ని రాజకీయ పార్టీలతో కలిసి అఖకిల పక్ష పోరాట సమితిగా ఏర్పడి దశల వారీగా వివిధ రూపాలలో పోరాటం చేయడం జరిగిందని, చివరికీ ఆంధ్ర పాలకులు ప్లాంట్ విస్తరణకు హామీ ఇచ్చిన అమలు చేయడంలో మళ్లీ నిర్లక్షం చేయడం జరిగిందని అన్నారు.

ఇక బి థర్మల్ విస్తరణ జరగదని ప్రజలు భావించడం జరుగుతున్న తరుణంలో ఎమ్మెల్యే చందర్ చొరవ చూపి బి థర్మల్‌ను 5 సంవత్సరాల ఎక్స్‌టెన్షన్ చేయించడం జరిగిందని, మరోసారి బి థర్మల్ మూసివేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక శ్రద్ధ చూపి విస్తరణ చేసేలా కృషి చేయాలని కోరారు. ప్లాంట్ విస్తరణకు మద్ధతుగా కార్పొరేటర్లు దాతు శ్రీనివాస్, అమ్రిన్ ఫాతిమా సలీం బేగ్, ఎన్‌వి.రమణారెడ్డి, పెంట రాజేష్, మేకల సదానందంతోపాటు నాయకులు కాంపల్లి సతీష్ తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News