Wednesday, January 22, 2025

కళాకారులకు పుట్టినిల్లు రామగుండం

- Advertisement -
- Advertisement -

కోల్‌సిటీ: కళాకారులకు రామగుండం నియోజక వర్గం పుట్టినిల్లని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గోదావరిఖనిలోని సర్వేస్ డ్యా న్స్ ఇన్టిట్యూట్ సమ్మర్ క్యాంప్ ముగింపును పుస్కరించుకొని స్థానిక శ్రీలక్ష్మి ఫంక్షన్ హాల్‌లో ఆదివారం రాత్రి నిర్వహించిన డ్యాన్స్ మస్తీ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజల్వన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కళాకారులపై తనకున్న అభిమానంతోనే దశాబ్ద కాలంగా ఈ ప్రాంత కళాకారులను ప్రోత్సహిస్తూ వస్తున్నానని అన్నారు.

అనంతరం చి న్నారులు ప్రదర్శించిన నృత్యాలను ఎమ్మెల్యే ఆసక్తిగా తిలకించారు. తదనంతరం నృత్య ప్రదర్శనలో పాల్గొన్న చిన్నారులకు ఎమ్మెల్యే జ్ఞా పికలను అందజేశారు.డ్యాన్స్ మాస్ సర్వేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మేజిక్ రాజా వ్యాఖ్యాతగా వ్యవహరించగా, కా ర్పొరేటర్ అడ్డాల స్వరూప రామస్వామి, నాయకులు మాదాసు రాంమ్మూర్తి, జెవి రాజు, దామెర శంకర్, దయానంద్ గాంధీ, పిఎ స్.అమరేందర్, అందె సదానందం, నూతి తిరుపతి, వడ్డెపల్లి శంకర్, దేవీ లక్ష్మినర్సయ్య, అడప శ్రీనివాస్, సందీప్, చిన్నారులు, వారి తల్లిదండ్రులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News