- Advertisement -
ఓ రిటైర్డు ఉపాధ్యాయుని వద్ద నుంచి పెన్షన్ మంజూరుకు సంబంధించి లంచం తీసుకుంటుండగా రామగుండం సబ్ ట్రెజరీ ఆఫీసర్ (ఎస్‌టిఓ), ఆఫీస్ సబార్డినేట్‌లను ఎసిబి అధికారులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే… రిటైర్డు ఉపాధ్యాయుడు కన్నూరి ఆనందరావుకు సంబంధించి పెన్షన్ మంజూరు చేయడం కోసం ఎస్‌టిఓ ఏకుల మహేశ్వర్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్ రెడ్డవేణి పవన్‌లు 10వేల రూపాయల లంచం డిమాండ్ చేశారు. దీంతో రిటైర్డు ఉపాధ్యాయుడు ఆనందరావు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. గురువారం రిటైర్డు టీచర్ ఆనందరావు నుంచి ఎస్‌టిఓ మహేశ్వర్, సబార్డినేట్ పవన్‌లు లంచం తీసుకుంటుండగా, ఎసిబి డీఎస్పీ రమణ మూర్తి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం పట్టుబడ్డ వారికి కెమికల్ టెస్ట్ నిర్వహించారు. వీరిని కరీంనగర్ ఎసిబి స్పెషల్ కోర్టులో హాజరు పరుచనున్నారు.
- Advertisement -