Monday, December 23, 2024

తుంగభద్ర బోర్డు కార్యదర్శిగా రామకృష్ణారెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మూడు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టుగా ఉన్న తుంగభద్ర ప్రాజెక్టు నీటి నిర్వహణకు సంబంధించిన బోర్డు క్యాదర్శిగా ఒ.రామకృష్ణారెడ్డి నియమితులయ్యారు. కేంద్ర జలసంఘం ఈ మేరకు సోమవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకూ బోర్డు కార్యదర్శిగా పనిచేసిన జి.నాగమోహన్ పదవీకాలం ముగిసి పోవటంతో ఆయన స్థానంలో కేంద్ర జలసంఘం సంచాలకులుగా ఉన్న రామకృష్ణారెడ్డిని నియిస్తూ ఈ మేరకు సిడబ్యుసి ఆదేశాలు జారీ చేసింది.

రెండు మూడు రోజుల్లో ఆయన పదవీబాధ్యతలు చేపట్టనున్నారు. జి.నాగమోహన్‌ను తుంగభద్ర ప్రాజెక్టు బోర్డు సిబ్బంది ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు.మూడేళ్లపాటు బోర్డులో పనిచేసిన నాగమోహన్ కర్ణాటక, ఆంధప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాలకు బచావత్ ట్రిబ్యునల్ తుంగభద్ర ప్రాజెక్టు ద్వారా కేటాయించిన వాటాల మేరకు నీటినిర్వహణకు కృషి చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News