Wednesday, January 22, 2025

వడ్లు కొనేవరకూ కేంద్రంపై పోరు ఆగదు

- Advertisement -
- Advertisement -

మోత్కూరులో అంబేద్కర్ చౌరస్తాలో నల్ల జెండాలతో నిరసన తెలుపుతున్న టిఆర్ఎస్ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి

మన తెలంగాణ/మోత్కూరు: యాసంగిలో రాష్ట్ర రైతాంగం పండించిన పూర్తి ధాన్యం కొనే వరకూ కేంద్రంపై టిఆర్‌ఎస్ పోరు ఆగదని ఆ పార్టీ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రంపై టిఆర్‌ఎస్ చేస్తున్న పోరులో భాగంగా శుక్రవారం టిఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు గ్రామాల్లో తమ ఇళ్లపై నల్ల జెండాలు ఎగురవేసి నిరసన వ్యక్తం చేసి, ప్రధాని మోడీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో నల్లజెండాలతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి మాట్లాడారు. కేంద్రం తెలంగాణ రైతుల పట్ల అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలను విడనాడి వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ మండల, పట్టణ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు పొన్నెబోయిన రమేష్, బొడ్డుపల్లి కల్యాణ్‌ చక్రవర్తి, గజ్జి మల్లేష్, మార్కెట్ మాజీ చైర్మన్ టి.మేఘారెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు చెడిపెల్లి రఘుపతి, కౌన్సిలర్లు పురుగుల వెంకన్న, కూరెళ్ల కుమారస్వామి, మాజీ ఎంపిటిసి జంగ శ్రీను, గ్రంథాలయ చైర్మన్ కోమటి మత్సగిరి, సర్పంచులు పేలపూడి మధు, బత్తిని తిరుమలేష్, మహిళా అధ్యక్షురాలు మల్లం అనిత, నాయకులు చింతల విజయభాస్కర్‌రెడ్డి, దాసరి తిరుమలేష్, దబ్బెటి రమేష్, అవిశెట్టి స్వామి, మొరిగాల వెంకన్న, డి.శ్రీకాంత్‌చారి, ఎల్ స్వామి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News