Monday, December 23, 2024

18 ఏళ్ల తర్వాత రమణ గోగుల సాంగ్…

- Advertisement -
- Advertisement -

హీరో వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ’సంక్రాంతికి వస్తున్నాం’. 2025లో సంక్రాంతి పండుగకు ఈ సినిమా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 18 ఏళ్ల తర్వాత విక్టరీ వెంకటేష్, మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల కాంబో మళ్లీ వస్తోంది. బ్లాక్‌బస్టర్ లక్ష్మి సినిమా కోసం వెంకటేష్‌తో కలిసి పని చేసిన రమణ గోగుల ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫస్ట్ సింగిల్‌కి తన వాయిస్‌ని అందించారు.

ఇది వీడియో ద్వారా తెలియజేశారు. రెగ్యులర్ ప్లేబ్యాక్ సింగర్ కాకుండా విచిత్రమైన స్వరంతో ఈ పాట ఉండాలని దర్శకుడు అనిల్ రావిపూడి భావించారు. దీంతో భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన, భాస్కరభట్ల రాసిన గోదారి గట్టుమీద ట్రాక్‌కి స్వరాన్ని అందించడానికి వెటరన్ రమణ గోగులని ఎంపిక చేశారు. ఈ పాటను త్వరలో విడుదల చేయనున్నారు. రమణ గోగుల ప్రత్యేకమైన స్వరంతో ఈ పాట మూవీ ప్రత్యేక ఆకర్షణల్లో ఒకటిగా నిలవనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News