Sunday, December 22, 2024

భార్య అందంగా ఉందని… గుడికి తీసుకెళ్లి చంపేశాడు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: భార్య అందంగా ముస్తాబువుతోందని దేవాలయానికి తీసుకెళ్లి తన స్నేహితులతో  కలిసి ఆమెను భర్త చంపేసిన సంఘటన కర్నాటక రాష్ట్రం రామనగర జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. మాగడి అనే ప్రాంతంలో ఉమేశ్, దివ్య(32) అనే దంపతులు నివసిస్తున్నారు. దివ్య ఎక్కువగా అందంగా ఉండేందుకు లిప్ స్టిక్స్ వేసుకోవడంతో టాటూలు కూడా వేయించుకుంది. దీంతో భార్య లిఫ్ స్టిక్, టాటూలు ఉపయోగించడం భర్త నచ్చకపోవడంతో వద్దని పలుమార్లు ఆమెకు చెప్పాడు. దీంతో గొడవలు ఎక్కువగా జరగడంతో వేధింపులు తట్టుకోలేక స్థానిక కోర్టులో దివ్య విడాకుల పిటిషన్ వేసింది.
మంగళవారం ఇద్దరు కోర్టుకు హాజరయ్యారు. ఇక నుంచి భార్యపై అనుమానం పెంచుకోనని ఆమెను భర్త నమ్మించాడు. భర్త మారాడనుకొని అతడితో కలిసి ఆమె ఊజగల్లు గుడికి వెళ్లింది. ముందస్తు ప్లాన్ ప్రకారం ఆమెను అక్కడే హత్యా చేయాలని భర్త  నిర్ణయం తీసుకున్నాడు. ఆమెను కొండ మీదకు తీసుకెళ్లి నలుగురు స్నేహితులతో కలిసి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని చీలూరు అటవీ ప్రాంతంలో పడేసి వెళ్లిపోయాడు. దివ్య తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఉమేశ్ ముగ్గురు స్నేహితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తామే హత్య చేశామని ఒప్పుకున్నారు. భర్త కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News