Wednesday, January 15, 2025

జులై 3నుంచి పునఃప్రసారం టీవీ సీరియల్ రామాయణం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రేక్షకులను టీవీల ముందు కట్టిపడేసిన రామానంద్ సాగర్ రామాయణ్ ధారావాహికం తిరిగి టీవీలో ప్రసారం కానుంది. ప్రఖ్యాత షెమారూ టీవీ ఛానల్‌లో ఈ సీరియల్ వచ్చే నెల 3వ తేదీనుంచి సాయంత్రం ఏడున్నరకు ప్రసారం అవుతుంది. ఈ విషయాన్ని ఈ ఛానెల్ వర్గాలు వెల్లడించాయి. ఈ రామాయణంలో రాముడిగా అరుణ్‌గోవిల్, సీతగా దీపికా చకిలా , లక్ష్మణుడిగా సునీల్ లహరి నటించారు. ఇక కీలక పాత్రలో హనుమంతుడిగా దారాసింగ్ , రావణుడుగా అరవింద్ త్రివేది నటించారు.

పాత్రలకు తగ్గట్లుగా ఆహార్యం, అభినయం హుందాతనం ప్రదర్శించడంతో అందరిని ఈ సీరియల్ ఆటక్టుకుంది. అప్పట్లో ఈ సీరియల్ దూరదర్శన్‌లో 1987 జనవరి 25 నుంచి 1988 జులై 31వరకూ సాగింది. ప్రజల నుంచి మంగళహారతులతో స్పందనలు పొందింది. ఇటీవల విడుదలైన ఆదిపురుష్ సినిమాలోని పాత్రలు సంభాషణలు వివాదాలకు దారితీశాయి. పాత్రలను కించపర్చే విధంగా సినిమా సాగిందనే విమర్శలు తలెత్తాయి. ఈ దశలో తిరిగి రామాయణం సీరియల్ రావడం కీలక ఘట్టం అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News