Wednesday, January 15, 2025

త్వరలో డిడిలో ‘రామాయణ్’ సీరియల్ పునఃప్రసారం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఒకప్పుడు కోట్లాది మంది ప్రేక్షకులను టీవీ సెట్లకు అతుక్కుపోయేలా చేసిన రామానంద్ సాగర్ దర్శకత్వం వహించిన టీవీ సీరియల్ రామాయణ్ మళ్లీ దూరదర్శన్ నేషనల్‌లో త్వరలోనే ప్రసారం కానుంది. రామాయణ్‌ను తిరిగి ప్రసారం చేయాలని దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఇప్పటికీ కోరుకుంటున్నారు. అరుణ్ గోవిల్ రాముడిగా, దీపికా చికిలియా సీతగా, సునీల్ లాహ్రి లక్ష్మణుడిగా నటించిన

ఈ సీరియల్ 1987లో తొలిసారిగా దూరదర్శన్‌లో ప్రసారమైనప్పుడు లక్షలాది మంది ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న విషయం తెలిసిందే. ఇటీవల అయోధ్యలో రామమందిరం ప్రాణప్రతిష్ఠ సమయంలో వీరు అక్కడికి వెళ్తే జనం ఇప్పటికీ అదే అభిమానాన్ని వారిపై కురిపించారు కూడా . దూరదర్శన్ చరిత్రలోనే మరపురాని సీరియల్‌గా నిలిచిపోయిన రామాయణ్ సీరియల్‌ను త్వరలోనే పునః ప్రసారం చేయనున్నట్లు డిడి నేషనల్ తన ఎక్స్ ఖాతాలో ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News