Wednesday, January 22, 2025

రామన్నపేటను మోడ్రన్ పట్టణంగా తీర్చిదిద్దుతా

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: రామన్నపేటను మోడ్రన్ పట్టణంగా తీర్చిదిద్దుతాఅని, అభివృద్ధి చేసే నాయకుడికి పట్టంకట్టండి , మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం రామన్నపేట పట్టణ కేంద్రంలోని శ్రీ చెన్నకేశ్వరస్వామి దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయ పునఃనిర్మాణానికి రూ.2 .50కోట్లు మంజూరు చేసినందుకుగాను ఎమ్మెల్యేను పట్టణవాసులు సన్మానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రజలు , భక్తులు గర్వపడేలా ఈ ఆలయాన్ని పునఃనిర్మాణం చేపడతామని , టెండర్ల ప్రక్రియ కాగానే పనులు ప్రారంభిస్తామని అన్నారు. ఇప్పటివరకు 3కోట్ల నిధులు కేటాయించానని, వీధివీధినా సిసిరోడ్లు వేశానని అన్నారు. శిధిలావస్థకు చేరిన ప్రభుత్వ దవాఖానాకు త్వరలో నూతన భవనాన్ని మంజూరుచేయించి అభివృద్ధి చేస్తానని హామి ఇచ్చారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగగా అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రామన్నపేట ఎంపిడిఓ కార్యాలయంలో అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు.

బిఆర్‌ఎస్ పట్టణాధ్యక్షుడు పోతరాజు సాయి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం లో ఎంపిపి కన్నెబోయిన జ్యోతి బలరాం, జడ్పిటిసి పున్న లక్ష్మిజగన్‌మోహన్, సింగిల్ విండో చై ర్మన్ నంద్యాల భిక్షంరెడ్డి, బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మందడి ఉదయ్‌రెడ్డి, మార్కెట్ వైస్ చై ర్మన్ కంభంపాటి శ్రీనివాస్, కార్యదర్శి పోషబోయిన మల్లేశం, ఎంపిటిసి గొరిగి నరసింహ, ఎండి అమీర్, సర్పంచులు గుత్తా నర్సిరెడ్డి, పొడిచేడు కిషన్, నాయకులు బందెల రాములు, అకవరపు మధుబాబు,రామిని రమేష్, మాజి వైస్ ఎంపిపి బద్దుల ఉమా రమేష్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News