- Advertisement -
ముచ్చింతల్: రంగారెడ్డి జిల్లాలోని ముచ్చింతల్ లో శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహం వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలు వచ్చే నెల 2 నుంచి 14 వరకు నిర్వహించనున్నారు. సమతామూర్తి కేంద్రం వివరాలను చినజీయర్ స్వామి సోమవారం వెల్లడించారు. ప్రతి నిర్మాణం 9తో ముడిపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. తనిఖీల తర్వాతే భక్తులకు అనుమతి ఇస్తామని చినజీయర్ స్వామి సూచించారు. శ్రీరామానుజ చరిత్రపై థియేటర్ లో ప్రదర్శన వేస్తామన్నారు. ప్రాంగణంలో 108 దివ్యదేశాలు నిర్మించామని చెప్పారు. ఒక్కరోజులోనే 108 దివ్యక్షేత్రాలను చూసే అదృష్టం కలుగుతుందన్నారు. 108 దివ్యక్షేత్రాల్లో తిరుపతి, అహోబిలం కూడా ఉన్నాయి. పాలసముద్రం, వైకుంఠ దివ్యదేశాలను కూడా నిర్మించామన్నారు. సమాతామూర్తి విగ్రహం దిగువ భాగంలో 108 మెట్లు నిర్మించామని తెలిపారు.
- Advertisement -