- Advertisement -
తెలంగాణ ఖ్యాతి మరోసారి ప్రపంచం ముందు ఆవిష్కృతమైంది.
తెలంగాణలో పర్యాటకం మరింత వర్థిల్లనుంది -మంత్రి కొప్పుల ఈశ్వర్
హైదరాబాద్: అద్భుతమైన శిల్పకళకు నెలువైన రామప్ప ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించడం పట్ల షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ హర్షం వ్యక్తం చేశారు. దీంతో ముఖ్యమంత్రి కెసిఆర్, తెలంగాణ రాష్ట్ర పేరు ప్రఖ్యాతలు మరోసారి ప్రపంచం ముందు ఆవిష్కృతం అయ్యాయని ఒక ప్రకటనలో మంత్రి పేర్కొన్నారు. ప్రజల చిరకాల వాంఛ అయిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మహోద్యమాన్ని నడిపిన కెసిఆర్.. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ అన్ని రంగాలలో గొప్పగా అభివృద్ధి చేస్తున్నారని కొప్పుల అన్నారు. కెసిఆర్ ఆలోచనలు, దూరదృష్టి, పక్కా ప్రణాళికతో జల, విద్యుత్, హరిత,శ్వేత, నీలి, గులాబీ,పారిశ్రామిక విప్లవాలు వచ్చాయని,ఇక పర్యాటక విప్లవం కూడా రానున్నదని ఈశ్వర్ చెప్పారు.
- Advertisement -