Monday, December 23, 2024

రామప్పను అభివృద్ధి చేయాలి: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

ములుగు: మార్పు కోసమే హాథ్ సే హాథ్ జోడో యాత్రను మొదలుపెట్టామని టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెలిపారు. ములుగు జిల్లాలో రెండో రోజు రేవంత్ రెడ్డి హాత్ సేథ్ హాత్ జోడో యాత్ర జరుగుతోంది. రామప్ప ఆలయాన్ని టిపిపిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సందర్శించారు. రామలింగేశ్వర ఆలయంలో ఎంఎల్‌ఎ సీతక్కతో కలిసి రేవంత్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడారు. ప్రజల ఆకాంక్షలను తెలుసుకొని మేనిఫెస్టో విడుదల చేస్తామన్నారు. రామప్పను యునెస్కో గుర్తించినా తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు. తెలంగాణ వారసత్వ సంపదను కాలగర్భంలో కలపాలని ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక నిధులు కేటాయించి రామప్పను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రామప్పను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. మంగళవారం రామప్ప నుంచి పాలంపేట, రామంజపూర్ చెంచుకాలనీ, నారాయణగిరిపల్లె , భూపాలపల్లి నియోజకవర్గం బుధ్దారం వరకు రేవంత్ పాదయాత్ర కొనసాగనుంది. మధ్యాహ్నం చాతరాజుపల్లి, కేశపూర్, నరసాపూర్, బండపల్లి మీదుగా యాత్ర సాగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News