హైదరాబాద్ : తెలంగాణలోని రామప్ప దేవాలయానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తించింది. కాకతీయ శిల్పకళా వైభవానికి రామప్ప ఆలయం ప్రతీక. చైనాలోని ఫ్యూజులో జరిగిన ప్రపంచ వారసత్వ కమిటీ వర్చువల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వారసత్వ గుర్తింపు పొందిన తొలి కట్టడంగా రామప్ప రికార్డుకెక్కింది. ములుగు జిల్లా పాలంపేటలో 800 ఏళ్ల కాలం నాటి రామప్ప ఆయలం శిల్పి పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చి ఖండాంతరాలు దాటింది. రామప్ప దేవాలయం క్రీ.శ. 1213లో కాకతీయ ప్రభువు గణపతిదేవుని సైన్యాధ్యక్షుడు రేచర్ల రుద్రుడు కట్టించాడు. 2020 ఏడాది దేశం నుంచి ఏకైక కట్టడం రామప్ప ఆలయం నామినేట్ అయింది. 2019 సెప్టెంబర్ లో యునెస్కో ప్రతినిధులు ఆయయాన్ని సందర్శించారు. నీటిలో తేలియాడే ఇటుకల వినియోగం రామప్ప ఆలయం ప్రత్యేకత. వారసత్వ గుర్తింపునకు కృషి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గతంలో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆలయ ప్రత్యేకతలు వివరిస్తూ యునెస్కోకు ప్రభుత్వం నివేదికలు పంపింది.
🔴 BREAKING!
Just inscribed as @UNESCO #WorldHeritage site: Kakatiya Rudreshwara (Ramappa) Temple, Telangana, in #India🇮🇳. Bravo! 👏
ℹ️ https://t.co/X7SWIos7D9 #44WHC pic.twitter.com/cq3ngcsGy9
— UNESCO 🏛️ #Education #Sciences #Culture 🇺🇳 (@UNESCO) July 25, 2021
Ramappa Temple is UNESCO World Heritage Site