Thursday, January 23, 2025

పవర్‌ఫుల్ మాస్ నోటీస్..

- Advertisement -
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలకానుంది. శరత్ మండవ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్పీ, రవితేజ టీం వర్క్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఇక బుధవారం ‘రామారావు ఆన్ డ్యూటీ మాస్ నోటీస్’గా మరో పవర్‌ఫుల్ మాస్ యాక్షన్ మినీ ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇది బ్రిలియంట్ యాక్షన్, పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో అలరించింది.

“నేను లక్కుల మీద లాటరీల మీద డిపెండయ్యేవాడిని కాదు.. నా వర్క్ మీద డిపెండ్ అయ్యేవాడిని” అని రవితేజ చెప్పిన డైలాగ్స్ థియేటర్‌లో ఫ్యాన్స్‌తో విజిల్స్ వేయించే మూమెంట్‌లా వుంది. “మీ ఆయన మెరుపులాంటి వాడు. శబ్దం లేకుండా వెలుగునిచ్చే రకం”అని తనికెళ్ళ భరణి చెప్పే డైలాగ్ రామారావు పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా వుంటుందో తెలియజేసింది. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ పవర్‌ఫుల్‌గా ఉంటూ అదే సమయంలో చాలా యూనిక్‌గా వున్నాయి. సామ్ సిఎస్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అవుట్ స్టాండింగా వుంది. దర్శకుడు శరత్ మండవ ఫ్యాన్స్, మాస్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించే ఎలిమెంట్స్‌తో ‘రామారావు అన్ డ్యూటీ’ని సిద్ధం చేశారని ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే అర్ధమవుతుంది. ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించగా, వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో కనిపించనున్నారు.

‘Ramarao On Duty’ Action Trailer Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News