Monday, December 23, 2024

‘రామారావు ఆన్ డ్యూటీ’ ట్రైలర్ లోడింగ్

- Advertisement -
- Advertisement -

Ramarao On Duty Mass Trailer Loading

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ జూలై 29న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. నూతన దర్శకుడు శరత్ మండవ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ‘రామారావు ఆన్ డ్యూటీ మాస్ ట్రైలర్ లోడ్ అవుతుంది. త్వరలోనే నిర్మాతలు ట్రైలర్ ని విడుదల చేయనున్నారు. ట్రైలర్ లోడింగ్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో రవితేజ క్లాస్ అండ్ స్టైలిష్ గా ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో రవితేజ తహశీల్దార్‌గా కనిపించనున్నారు. 1995 నాటి నేపథ్యంలో యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ ఐఎస్‌సి సినిమాటోగ్రఫీ అందించగా, ప్రవీణ్ కెఎల్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. ‘రామారావు ఆన్ డ్యూటీ’ యూనిట్ ప్రమోషన్స్ ని భారీగా చేస్తోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News